అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ ఇటీవల ‘ది గోట్ టూర్’లో భారత్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. తొలుత ఆయన కోల్‌కతాలో పర్యటించారు. అయితే మెస్సీ కోల్‌కతా పర్యటన తీవ్ర దుమారం రేపింది. షెడ్యూల్ ప్రకారం మెస్సీ కోల్‌కతాలోని సాల్ట్ లేక్ మైదానరంలో 2 గంటలు ఉండాలి. కానీ, భద్రత లోపం కారణం మెస్సీ కేవలం 22 నిమిషాలు మాత్రమే ఉండి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ కాస్త సమయంలోనూ చాలామంది మెస్సీని చూడలేకపోయారు. దీంతో అభిమానులు ఆగ్రహానికి గురయ్యారు బ్యారికేడ్లు దాటి మైదానంలోకి చొచ్చుకువెళ్లారు. గ్రౌండ్‌లోకి వాటర్ బాటిల్స్ విసిరేశారు. కుర్చీలు విరగ్గొట్టారు.
అయితే ఈ ఘటనపై టీం ఇ:డియా క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ స్పందించారు. ఈ గందరగోళానికి మెస్సీనే కారణమని ఆయన ఆరోపించారు. ‘‘తన నిబద్ధతను తెలియజేయడంలో విఫలమైన వ్యక్తి (మెస్సీ) తప్ప మిగితా వారందరిని నిందించారు. నిజానికి అసలు ఒప్పందం ఏంటో బహిరంగంగా తెలియదు. కానీ అతడు అనుకున్న సమయం కన్నా ముందే వెళ్లిపోయాడు. ఈ విషయంలో నిజమైన దోషులు మెస్సీ, అతడి పరివారమే’’ అని గవాస్క్రర్ పేర్కొన్నారు.