ప్రస్తుత హీరోయిన్లలో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న నటి రష్మిక. ఇటీవల కాలంలో ఆమె నటించిన సినిమాలు అన్ని హిట్లే. కాగా, రొటీన్‌కు భిన్నంగా రష్మిక నటించిన హారర్ కామెడీ థ్రిల్లర్ ‘థామా’. మాడాక్ హారర్ కామెడి యూనివర్స్‌లో వచ్చిన చిత్రమిది. ఈ సినిమాలో ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటించాడు. భేతాళ జాతికి చెందిన యువతికి, మామూలు మనిషికి మధ్య జరిగే కథతో ఈ సినిమాను రూపొందించారు. ఈ చిత్రానికి ‘ముంజ్య’ ఫేమ్ ఆదిత్య సర్పోత్థార్ దర్శకత్వం వహించారు.
అయితే ఈ సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ 21న విడుదలై గ్రాండ్ సక్సెస్‌ను అందుకుంది. బాక్సాఫీస్‌లో రూ.220 కోట్ల వరకూ కలెక్షన్లు కొల్లగొట్టింది. అనంతరం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ ఒటిటిలోకి వచ్చేసింది. తెలుగు, హిందీ భాషల్లో అద్దె విధానంలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రం ఇప్పుడు ఉచితంగానే చూసే అవకాశం కల్పించారు. దీంతో అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు.