హైదరాబాద్: మాజీ సిఎం కెసిఆర్ చుట్టూ కొరివి దయ్యాలున్నాయని తెలంగాణ జాగృతి అధ్యక్షరాలు కల్వకుంట్ల కవిత బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి గురించి చెప్పిందని స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. కెసిఆర్ కుటుంబంలో గొడవలకు కారణం పల్లా రాజేశ్వరరెడ్డి అని అన్నారు. జనగామలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గొడవలవల్లే బిఆర్ఎస్ భ్రష్టు పట్టిందని, మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యను జీరో చేయాలని పల్లా రాజేశ్వరరెడ్డి చూస్తున్నారని తెలియజేశారు. తాటికొండ రాజయ్య ఇప్పటికైనా కళ్లు తెరవాలని సూచించారు. తెల్లారి లేస్తే కడియం శ్రీహరిని తిట్టడమే బిఆర్ఎస్ వాళ్లు టార్గెట్‌గా పెట్టుకున్నారని కడియం శ్రీహరి విమర్శించారు.