ఇఈ, రాజయోగం వంటి చిత్రాలతో దర్శకుడిగా ప్రతిభ చాటుకున్న రామ్ గణపతి హీరోగా నటిస్తున్న సినిమా కాలం. ఈ సినిమాను శ్రీ నవబాల క్రియేషన్స్, 3 కీజ్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై మణి లక్ష్మణరావు నిర్మిస్తున్నారు. రామ్ గణపతి ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. యంగ్ డైరెక్టర్ వెంకట సురేష్. ఆర్. రూపొందిస్తున్నారు. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో రూపొందిన ‘కాలం‘ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా ట్రైలర్‌ను హైదరాబాద్‌లో జరిగిన ఈవెంట్‌లో రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో యంగ్ హీరో సాయి రోనక్, మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం శ్రీలేఖ అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ వెంకట్ సురేష్.ఆర్. మాట్లాడుతూ ఈ సినిమా టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో ఆసక్తికరంగా ఉంటుందని అన్నారు. హీరో రామ్ గణపతి మాట్లాడుతూ ఈ సినిమా ఒక కొత్త సినిమాటిక్ అనుభూతిని ప్రేక్షకులకు అందిస్తుందని తెలియజేశారు. కార్యక్రమంలో మణి లక్ష్మణరావు, అంకిత సాహా పాల్గొన్నారు.