బాబీ సింహా, హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లుగా మెహర్ యరమతి దర్శకత్వంలో ఓ కొత్త చిత్రం రూపొందుతోంది. యువ ప్రొడక్షన్స్ బ్యానర్ పై యువ కృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రం సోమవారం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి ఎస్కేఎన్ క్లాప్ కొట్టారు. వంశీ నందిపాటి కెమెరా స్విచాన్ చేశా రు. తనికెళ్ళ భరణి మేకర్స్ కి స్క్రిప్ట్ అందించారు. ఈ వేడుకలో సినిమా యూనిట్ అందరూ పాల్గొన్నారు. ఈ చిత్రంలో తనికెళ్ల భరణి, సూర్య శ్రీనివాస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మూవీ లాం చింగ్ ఈవెంట్ లో నిర్మాత యువకృష్ణ మాట్లాడు తూ “మెహర్ ఈ కథ చెప్పిన వెంటనే నచ్చింది. అద్భుతమైన స్క్రిప్టు ఇది. ఈ కథ బాబీ సింహకు చాలా నచ్చి… వెంటనే చేద్దామని చెప్పడం మాకు ఎంతో ఉత్సాహాన్నిచ్చింది”అని అన్నారు. దర్శకుడు మెహర్ మాట్లాడుతూ ఇది నా దర్శకుడిగా ఇది నా తొలి సినిమా అని తెలిపారు. హీరో బాబీ సింహ మాట్లాడుతూ “ఒక నటుడిని ఛాలెంజ్ చేసే స్క్రిప్ట్ ఇది. నా కెరీర్‌లో ఈ సినిమా చాలా కొత్తగా ఉం టుంది”అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హెబ్బా పటేల్, సూర్య శ్రీనివాస్ పాల్గొన్నారు.