ఉత్తరప్రదేశ్‌లోని మథురలో భారీగా అగ్ని ప్రమాదం జరిగింది. ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై మంగళవారం తెల్లవారుజామున నాలుగు బస్సులకు మంటలు అంటుకున్నాయి. పొగమంచు కారణంగా వరుసగా వాహనాలు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు అగ్ని మాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్ని మాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పలువురు మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.