డేటా లోపభూయిష్టంగా ఉన్నప్పుడు, విధానాలు తప్పుదారి పట్టే ప్రమాదం ఉంది. పెంచిన వృద్ధి రేటు డేటా, గణాంకాలు ఆర్థిక పరమైన కష్టాలను తెచ్చి పెడతాయి. సామాజిక రంగా లలో పెట్టుబడి తగ్గించేందుకు ఇక్కట్లలో ఉన్న సమాజాలనుంచి మద్దతు తగ్గేందుకు తోడ్పడే రిస్క్ కూడా ఉంది. అసంఘటిత రంగంలో కోల్పోయిన ఉపాధి అవకాశాలను తక్కువగా లెక్కించినట్లయితే, ఉపాధి కల్పన పథకాలు సరిపోవు. పేదరికం అంచనాలను వక్రీకరిస్తే, ఆకలి బాధలను తీర్చి, పౌష్టికాహార లోపం సవరించే పథకాలు బలహీనపడగలవు. ఈ కోణంలో డేటా లేదా తప్పుడు సమాచారం ఇవ్వడమే, అది సమాజానికే హానికరంగా పనిచేస్తుంది. అయినా, ఈ ఆందోళనలను పారదర్శకంగా ఎదుర్కొనేందుకు బదులు, ప్రస్తుత రాజకీయ వ్యవస్థ తరచు దీనిని తిరస్కరిస్తూ, డేటా తారుమారు చేసేందుకే సిద్ధపడుతోంది. బిజెపి ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం క్షేత్ర స్థాయిలో వాస్తవాలు వేరేగా చిత్రీకరిస్తున్నా, ఆర్థిక వ్యవస్థ నిరంతరంగా స్పష్టమైన చిత్రాన్ని చూపేందుకు ప్రయత్నిస్తోంది.
భారతదేశ ఆర్థిక పునాదులను పటిష్టం చేసేందుకు దిద్దుబాటు చర్యలు చేపట్టాల్సిన సమయంలో పార్లమెంటు రాజకీయాలు, సైద్ధాంతిక నాటకాలలో మునిగిపోయినట్లు కన్పిస్తున్నది. రాజ్యాంగ విలువల చర్చ కాకుండా జాతీయ గీతం వందేమాతరంపై చర్చ అనుమానాలకు తావు ఇస్తోంది. 150 ఏళ్ల గీతంపై చారిత్రక వివరణ భావోద్వేగాలపై చట్టసభ సభ్యులు చర్చిస్తుండగా, ఇదే సమయంలో జరిగిన పరిణామాలను పట్టించుకోలేదు. అంతర్జాతీయ ద్రవ్యనిధి భారతదేశానికి, దాని జాతీయ ఖాతాల డేటా నాణ్యతకు సి గ్రేడ్ కేటాయించింది. పార్లమెంటు చర్చలలో మునిగి ఉండగా ప్రపంచ ఆర్థిక సంస్థ అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం ఆర్థిక డేటా విశ్వసనీయతను ప్రశ్నిస్తున్నది. ఇది దేశ ఆర్థికపరమైన ప్రాధాన్యతలు, పాలన, జవాబుదారీతనం క్షీణించడాన్ని తేటతెల్లం చేస్తున్నది. హిందూత్వ సైద్ధాంతిక చట్రానికి అనుగుణంగా చరిత్రను ఎలా పునర్నిర్వచిస్తున్నారో వందేమాతరం చర్చే వెల్లడిస్తున్నది. చరిత్రను సంక్లిష్టమైన వివాదాస్పదంగా, రాజ్యాంగపరమైన సున్నితత్వాలకు అనుగుణంగా వ్యవహరించడానికి బదులు, చట్ట సభ్యులు పవిత్రమైన కథనాన్ని విధించేందుకు ప్రయత్నించారు. ఒకప్పటి పరిణామాలపై అసమ్మతిని నమ్మకద్రోహంగా చిత్రీకరించడం యాదృచ్ఛికం కాదు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, ఆరోగ్యం, విద్య, పర్యావరణ పతనం, వాయు కాలుష్యం, ఆర్థిక పాలన వంటి పౌరుల జీవితాలను నిజంగా ప్రభావితం చేసే అంశాలపై చర్చను అడ్డుకోవడం కోసమే, ఈ చర్చ లేవదీశారు. అమూల్యమైన, పరిమితమైన పార్లమెంటరీ సమయం, సమకాలీన సమస్యలను పరిష్కరించదు. ప్రజాస్వామ్య చర్చలకు అవకాశం ఇవ్వడం లేదు.
భారతదేశ డేటా వ్యవస్థలపై ఐఎంఎఫ్ అంచనాలతో పోల్చినప్పుడు ఈ చర్చలను తప్పుదోవ పట్టించే ధోరణి ఇబ్బందికరంగా మారుతుంది. భారత జాతీయ ఖాతాల గణంకాలకు ఐఎంఎఫ్ -సి- గ్రేడ్ ఇవ్వడం అన్నది కేవలం సాంకేతిక ఫుట్ నోట్ కాదు. ఇది ఆర్థిక వాస్తవికతను ఎలా కొలుస్తారు. ఎలా అర్థం చేసుకుని వ్యాఖ్యానిస్తారనే దానికి స్పష్టమైన నేరారోపణ. ప్రొణబ్ సేన్, అరుణ్ కుమార్ వంటి ఆర్థికవేత్తలు ఎత్తి చూసినట్లుగా, వ్యవసాయాన్ని మినహాయించిన తర్వాత, జిడిపిలో దాదాపు 30 శాతం ఉండే అసంఘటిత రంగాన్ని అంచనా వేయడానికి భారత వ్యవస్థీకృత రంగ ప్రతినిధులు ప్రధానంగా ఆధారపడడం ఆందోళన కలిగించే విషయం. ఈ పద్ధతి స్వల్పకాలంలో స్థిరమైన వృద్ధికి పనిచేసి ఉండవచ్చు. కానీ నిర్మాణాత్మక ఇబ్బందుల సమయంలో ఇది దెబ్బతీస్తుంది. భారతదేశం వరుసగా ఇలాంటి సమస్యలను చాలా ఎదుర్కొంది.
నోట్ల రద్దు, జిఎస్‌టి అమలు, కొవిడ్ -19 మహమ్మారి వ్యవస్థీకృత, అసంఘటిత రంగాల మధ్య సంబంధాలపై పెద్ద ప్రభావమే చూపాయి. పెద్ద సంస్థలు, కార్పొరేట్ సంస్థలు త్వరగానే కోలుకున్నాయి. విస్తరించాయి కూడా. కానీ, అసంఘటిత రంగం, చిన్న వ్యాపారులు, కార్మికులు, సూక్ష్మ, చిన్న తరహా సంస్థలు దీర్ఘకాలిక ఇబ్బందులను ఎదుర్కొన్నాయి. ఈ క్లిష్ట సమయంలో రెండు రంగాలు కలిసి కదిలాయని భావించడం తప్పుకాదు. ఇది క్రమపద్ధతిలో ఆర్థిక వ్యవస్థ పనితీరును సుస్పష్టం చేస్తుంది. అటువంటి అంచనాల నేపథ్యంలో వెల్లడైన వృద్ధిరేటు కాగితంపై ఆకట్టుకునేలా కన్పించవచ్చు.కానీ లోతైన ఆర్థిక లోపాలను కప్పివేస్తాయి. నమ్మదగని డేటా వల్ల తలెత్తే ఇబ్బందులు విద్యాపరమైన చర్చకు మించి ఉంటాయి. విధాన నిర్ణయాలు తీసుకోవడానికి, బడ్జెట్‌లను కేటాయించేందుకు, సంక్షేమ పథకాల రూపకల్పనకు, అభివృద్ధి ప్రాధాన్యతలను నిర్ణయించడానికి ఆర్థిక డేటా యే ఆధారం.
డేటా లోపభూయిష్టంగా ఉన్నప్పుడు, విధానాలు తప్పుదారి పట్టే ప్రమాదం ఉంది. పెంచిన వృద్ధి రేటు డేటా, గణాంకాలు ఆర్థిక పరమైన కష్టాలను తెచ్చి పెడతాయి. సామాజిక రంగాలలో పెట్టుబడి తగ్గించేందుకు ఇక్కట్లలో ఉన్న సమాజాలనుంచి మద్దతు తగ్గేందుకు తోడ్పడే రిస్క్ కూడా ఉంది. అసంఘటిత రంగంలో కోల్పోయిన ఉపాధి అవకాశాలను తక్కువగా లెక్కించినట్లయితే, ఉపాధి కల్పన పథకాలు సరిపోవు. పేదరికం అంచనాలను వక్రీకరిస్తే, ఆకలి బాధలను తీర్చి, పౌష్టికాహార లోపం సవరించే పథకాలు బలహీనపడగలవు. ఈ కోణంలో డేటా లేదా తప్పుడు సమాచారం ఇవ్వడమే, అది సమాజానికే హానికరంగా పనిచేస్తుంది. అయినా, ఈ ఆందోళనలను పారదర్శకంగా ఎదుర్కొనేందుకు బదులు, ప్రస్తుత రాజకీయ వ్యవస్థ తరచు దీనిని తిరస్కరిస్తూ, డేటా తారుమారు చేసేందుకే సిద్ధపడుతోంది. బిజెపి ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం క్షేత్ర స్థాయిలో వాస్తవాలు వేరేగా చిత్రీకరిస్తున్నా, ఆర్థిక వ్యవస్థ నిరంతరంగా స్పష్టమైన చిత్రాన్ని చూపేందుకు ప్రయత్నిస్తోంది.
జిడిపి గణన పద్ధతుల్లో మార్పులు, వినియోగం, ఉపాధి డేటా విడుదల చేయడంలో విపరీతమైన జాప్యం, ఇబ్బందికరమైన సర్వే ఫలితాలు వస్తే, వాటిని అణచివేయడం లేదా దాచివేయడం, స్వతంత్ర, స్పష్టమైన అభిప్రాయాలను పక్కన పెట్టడం ఇవన్నీ అపనమ్మకాన్ని పెంచేందుకు దోహదపడుతున్నాయి. ఒకప్పుడు స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలు, జాతీయ గణాంకాల కమిషన్ వంటి వాటిలో రాజీనామాలు పెరిగిపోవడం, మార్జినలైజేషన్‌ల వల్ల ప్రజల విశ్వసనీయత తగ్గింది. మీడియాలో ఒక ముఖ్యమైన వర్గం ఈ సమస్యను మరింత జటిలం చేసింది. ముఖ్యమైన మినహాయింపులతో పాటు, ప్రధాన స్రవంతి మీడియాలోని పెద్ద విభాగాలు ఐఎంఎఫ్ ఆందోళనలను విస్మరించాయి. లేదా ఆవశ్యకతను తొలగించి లోపలి పేజీలకు కుదించాయి. డేటా నాణ్యత, పద్ధతి సమగ్రత, విధాన పరిణామాలను విశ్లేషించే టెలివిజన్ చర్చలకు బదులు, సైద్ధాంతిక పరమైన వాదనలు, పక్షపాత చర్చలకు వీలు కల్పిస్తున్నారు.
ఇది కేవలం ఎడిటోరియల్ వైఫల్యం కాదు, ప్రజాస్వామ్య వైఫల్యం, సంక్లిష్టమైన ఆర్థిక వాస్తవాలను అర్థం చేసుకోవడానికి పౌరులు మీడియాపై ఆధారపడే వ్యవస్థలో నిశ్శబ్దం ఆవరించింది. తగ్గించడం వల్ల ప్రజలను సమాచారం లేకుండా శక్తిహీనులుగా మారుస్తాయి. పార్లమెంటు చర్చించే అంశాలకు, అది విస్మరించే అంశాలకు మధ్య వ్యత్యాసం స్పష్టంగా ఉంది. చట్టసభ సభ్యులు ఎవరు ఏ అంశాన్ని మాట్లాడాలి అని వాదిస్తున్నప్పటికీ, భారతదేశంలో నగరాలు కలుషితమైన గాలితో ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. వాయు కాలుష్యం పెరిగిపోయింది. నదులను శుభ్రపరచేందుకు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నా, అవి ఇప్పటికీ విషపూరితంగానే ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రులు దీర్ఘకాలంగా నిధుల కొరతతో ఇబ్బందులు పడుతున్నాయి. ఫలితంగా అసమానతలు పెరిగిపోతున్నాయి. డేటా ఆధారిత చర్చ, ఆ డేటా ఆధారిత విధానం, శాసనసభ దృష్టిని కోరుతున్న సమస్యలు ఇవి. బదులుగా ప్రతీకవాదం గుంపులుగా మారుస్తోంది. జాతీయవాదం పాలనకు ప్రత్యామ్నాయంగా మారుతోంది.
ఈ అడ్డంకులు అధిగమించి ముందుకు సాగాలంటే, నిర్ణయాత్మకమైన దిద్దుబాటు అవసరం. మొదట భారతదేశం తన గణాంక సంస్థల విశ్వసనీయత, స్వతంత్రతను పునరుద్ధరించాలి. స్పష్టమైన పద్ధతి పారదర్శకత, సకాలంలో సర్వేల విడుదల చేయడం ద్వారా డేటా సేకరణ, వ్యాప్తికి రాజకీయ ఒత్తిడి నుంచి విముక్తి కల్పించాలి.
అంచనాలలోని తేడాలను దాచిపెట్టకుండా బహిర్గతంగా చర్చించాలి. రెండోది తీవ్రమైన విధాన చర్చలకు పార్లమెంటు స్పష్టమైన వేదికగా తన పాత్ర నిర్వహించాలి. ఆర్థిక డేటా నాణ్యత, ఉపాధి ధోరణులు, అసమానతలు, అభివృద్ధి ఫలితాలపై శాసనసభలు ఖచ్చితంగా చర్చించాలి. సైద్ధాంతిక చర్చలకు అప్పుడప్పుడు అంతరాయాలుగా చర్చలు సరికాదు. మూడవది. మీడియా తన అధికారాన్ని పెంచడానికి బదులుగా సమాచారం అందిచే బాధ్యతను తిరిగి నొక్కి చెప్పాలి. డేటా విశ్వసనీయత, సంస్థాగత కోత, విధాన వైఫల్యం గురించి విమర్శనాత్మక కథనాల ప్రాధాన్యత, లోతైన చర్చలు అర్హమైనవి. చివరగా, నిజమైన జాతీయ బలం బలవంతగా రుద్దడం వల్ల రాదని రాజకీయ నాయకత్వం గుర్తించాలి. అంతేకాదు, భౌతిక పరిస్థితులను మెరుగుపరచడం, అవకాశాలను విస్తరించడం, ప్రభుత్వ సంస్థలపై నమ్మకాన్ని పెంపొందించడం ద్వారా వస్తుందని కూడా రాజకీయ నాయకత్వం గుర్తించాలి.
భారత ప్రజాస్వామ్యం విజయాన్ని అభినందిస్తూనే, ఊహాగానాలపై నడవడానికి వీలు లేదు. చట్టసభ సభ్యులు వర్తమానం గురించి కాక, చర్చ గురించి చర్చించినప్పుడు, డేటాను, భావజాలానికి అనుగుణంగా చర్చించినప్పుడు, అభివృద్ధి ఒక భ్రమగా మారుతుంది. జాతీయవాదం నిజమైన పరీక్ష ఆచార బద్ధమైన విధేయత ప్రదర్శనలో కాదు సత్యాన్ని ఎదుర్కొనడానికి, వాటిపై చర్య తీసుకోవడానికి సిద్ధమవడం లోనే ఉంది.
గీతార్థ పాఠక్