తన భార్య నల్లగా ఉందని ఓ భార్యను ఆమెను పుట్టింటిలో వదిలేశాడో ప్రబుద్ధుడు. దీంతో ఆ భార్య బంధువులతో కలిసి ఏకంగా అత్తమామల ఇంటి ముందు ఆందోళన చేపట్టింది. ఎపిలోని పల్నాడు జిల్లా పరిధిలోని వినుకొండలో ఈ ఘటన చోటుచేసుకుంది. వినుకొండ మండలం నడిగడ్డకు చెందిన గోపి లక్ష్మికి కోటేశ్వరరావుతో ఈ ఏడాది జూన్‌లో వివాహం జరిగింది. పెళ్లి జరిగిన రెండు నెలల నుంచి భర్త, అత్త శేషమ్మ, మామ వెంకటేశ్వర్లు వేధిస్తున్నారని బాధితురాలు చెబుతోంది. పెళ్లి సమయంలో తన తల్లిదండ్రులు రెండు ఎకరాల పొలం అమ్మి 20 లక్షలు డబ్బులు, 20 సవర్ల బంగారం కట్నంగా ఇచ్చారని వెల్లడించింది. అదనపు కట్నం తెమ్మని అత్త మామలు వేధిస్తున్నారు. తిండి కూడా పెట్టకుండా కొట్టి పుట్టింటికి పంపారు. నల్లగా ఉన్నానని భర్త, అశుభాలు జరుగుతున్నాయని మామ, అత్త వేధింపులకు గురి చేస్తున్నారని బాధితు రాలు చెబుతోంది. తల్లి దండ్రులతో కలసి అత్తగారింటికి వెళ్ళగా మాపై దాడికి ప్రయత్నించి, ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారంటూ బాధితురాలు వాపోయింది.. తనకు న్యాయం చేయాలని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది. దీంతో కోడలు గోపి లక్ష్మి అత్త ఇంటి ముందు ఆందోళనకు దిగింది..