న్యూఢిల్లీ : వాతావరణ పరిస్థితుల కారణంగా న్యాయవాదులు, కక్షిదారులు హైబ్రిడ్ విధానంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు విచారణకు హాజరు కావచ్చని చీఫ్ జస్టిస్ సూర్యకాంత సూచించారు. ఈమేరకు ఆదివారం సుప్రీం కోర్టు కార్యనిర్వాహక యంత్రాంగం సర్కులర్ జారీ చేసింది. ఆదివారం నాడు ఢిల్లీలో వాయు నాణ్యత సూచిక 461కు పైగా పెరిగింది.
ఈ శీతాకాలంలో అత్యంత వాయు కాలుష్య దినంగా, డిసెంబర్ నెలలో రెండవ కాలుష్య పరమ అధ్వాన్న దినంగా పరిగణింపబడింది. సుదీర్ఘకాలంగా ఈ హానికరమైన విషగాలి కొనసాగుతుండడంతో ప్రజారోగ్య సమస్యలు తీవ్రంగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. తమిళనాడు, కేరళ, పశ్చిమబెంగాల్, తదితర రాష్ట్రాల్లో ఎన్నికల కమిషన్ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ చేపట్టడంపై దాఖలైన పిటిషన్లను విచారించే సందర్భంగా సిజెఐ ఈ సూచన చేశారు.