కామారెడ్డి జిల్లా, తాడ్వాయి మండలం, ఎర్రపహడ్ గ్రామంలో గండి మీది వ్యవసాయ భూమి ప్రాంతంలో ఒక రైతుకు చెందిన ఆవుదూడపై చిరుతపులి దాడి చేసి చంపేసింది. రైతు భూంపల్లి సంగయ్య ఆదివారం తన దూడను వ్యవసాయ భూమి క్షేత్రంలో ప్రతిరోజు మాదిరిగా కట్టేసి ఇంటికి వచ్చారు. సోమవారం ఉదయం చూడగా పులి దాడి చేసి చంపేసినట్టు ఆనవాళ్లు ఏర్పడ్డాయని గుర్తించాడు. లేగ దూడ చనిపోవడంతో తనకు తీవ్ర నష్టమని వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశాడు. పులి సంచారం వల్ల జంతువులకే కాకుండా మనుషులకు కూడా ప్రాణాపాయం ఉందని, ఫారెస్ట్ అధికారులు తగిన చర్యలు తీసుకొని సంరక్షణ చర్యలు తీసుకోవాలని కోరాడు.