అతివేగంతో కారు అదుపు తప్పి జనం మీదకి దూసుకెళ్లిన ఘటనా ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా అబనిగడ్డ మండలం చల్లపల్లి లో చోటు చేసుకుంది. రోడ్డుపై వెళ్తున్న బైకర్లను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు ఘటనాస్థలిలోనే మృతి చెందగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.