ఏబీసీ ప్రొడక్షన్ పతాకంపై భాస్కర్, కోటేశ్వర రావు ప్రధాన పాత్రదారులుగా మణికంఠ రాజేంద్ర బాబు దర్శకత్వంలో అప్పినపల్లి భాస్కరాచారి నిర్మించిన చిత్రం ‘విధాత’. వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందిన ఈ సినిమా త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సినిమా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు మణికంఠ రాజేంద్రబాబు మాట్లాడుతూ.. ‘ఈ సినిమాలో కీలక పాత్రలో భాస్కరాచారి నటించారు. ఆయన ఈ సినిమాను ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు’ అని అన్నారు. నిర్మాత డాక్టర్ అప్పినపల్లి భాస్కరాచారి మాట్లాడుతూ.. ‘కొన్ని వాస్తవ ఘటనల నేపథ్యంతో ఈ సినిమాను నిర్మించాం. కథా కథనాలు, పాత్రల చిత్రణ ఎంతో సహజంగా ఉంటూ ఆకట్టుకుంటాయి’ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాదంబరి కిరణ్, డ్రమ్స్ రాము తదితరులు పాల్గొన్నారు.