ముంబయి: భార్యను పాము కాటుతో చంపేశాడు, అనంతరం తన భార్య పాము కాటుతో చనిపోయిందని నమ్మించి ఆమెకు భర్త అంత్యక్రియలు చేయించాడు. మూడు సంవత్సరాలు తరువాత నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ తరలించారు. ఈ సంఘటన మహారాష్ట్రలోని బడ్లాపూర్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. బండ్లాపూర్ ప్రాంతంలో నీర్జా ఆంబేకర్-రూపేశ్ ఆంబేకర్ అనే దంపతులు నివసిస్తున్నారు. నీర్జా ఆంబేకర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నేతగా పని చేస్తున్నారు. 2022లో నీర్జా ఆంబేకర్ హఠన్మారణం చెందారు. పాము కాటుతో చనిపోయిందని వైద్యుల నిర్థారించారు. దీంతో రేపేశ్ తన భార్యకు అంతక్రియలు జరిపించాడు. బడ్లాపూర్‌లోని ఓ హత్య కేసులో ఋషికేష్ దాళ్కేను పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. పోలీసులు తనదైన శైలిలో ప్రశ్నిస్తుండగా నీర్జా ఆంబేకర్ హత్య కేసు వెలుగులోకి వచ్చింది.
రూపేశ్ ఆంబేకర్ తన భార్య నీర్జాను చంపాలని నిర్ణయం తీసుకున్నాడు. తన ముగ్గురు సహచరులు చేతన్ దుధానే, కునాల్ చౌధరీ, ఋషికేష్ చాళ్కేతో కలిసి హత్య చేయాలని ప్లాన్ వేసుకున్నాడు. భార్య హత్య బయటకు రాకూడదనే ఉదేశంతో విషపు పామును ఇంట్లోకి తీసుకొచ్చాడు. భార్యకు భర్త మసాజ్ చేస్తానని చెప్పి పాముతో ఎడమ కాలు మీద మూడు సార్లు కాటు వేయించాడు. సహజ మరణంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించి సక్సెస్ అయ్యాడు. పోలీసులు సహజ మరణంగా భావించి ఎడిఆర్ నమోదు చేసి కేసును మూసివేశారు. నిందితులో ఒకడు ఋషికేష్ మరో హత్య కేసులో పోలీసులకు చిక్కడంతో ఈ హత్య వెలుగులోకి వచ్చింది. పోలీసులు ముగ్గురును అదుపులోకి తీసుకొని ప్రశ్నించడంతో నిజాలు ఒప్పుకున్నాడు. వెంటనే ముగ్గురితో పాటు భర్తను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.