అమరావతి: ధ్వజస్తంభాలకు అవసరమైన చెట్లను పెంచాలని నిర్ణయించామని టిటిడి చైర్మన్ బి.ఆర్. నాయుడు తెలిపారు. దేశంలోని ఆలయాలకు ధ్వజస్తంభాలను టిటిడి అందిస్తుందని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..బోర్డు మీటింగ్ లో వాటన్నింటిపై చర్చిస్తామని, జనవరి 10 వరకు తిరుమలలోనే ఉంటానని తెలియజేశారు. ఏ సమస్యలున్నా తన దృష్టికి తీసుకురండని, పిఎసి వన్, పిఎసి3 సరిగా లేదని తన దృష్టికి వచ్చిందని బి.ఆర్. నాయుడు పేర్కొన్నారు. పలమనేరు దగ్గర 100 ఎకరాల స్థలాన్ని పరిశీలిస్తున్నామని, తిరుమల, తిరుపతిలో రోజుకో డిపార్ట్ మెంట్ ను తనిఖీ చేస్తున్నామని అన్నారు. అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని, 50 పాయింట్ల అజెండా ఉందని బి.ఆర్. నాయుడు స్పష్టం చేశారు.