ఢిల్లీ: పార్లమెంట్‌లో గందరగోళం నెలకొంది. ఓట్ చోరీ ర్యాలీలో ప్రధాని మోడీపై కాంగ్రెస్ వ్యాఖ్యల దుమారం లేపాయి. లోక్‌సభ, రాజ్యసభలో బిజెపి నేతలు ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే క్షమాపణ చెప్పాలని బిజెపి డిమాండ్ చేసింది. ప్రధాని నరేంద్ర మోడీకి సమాధి తవ్వాలంటూ నినాదాలు చేశారని, ప్రధానిని చంపాలని పిలుపునిస్తారా? అని బిజెపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ ప్రజలకు కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలని బిజెపి డిమాండ్ చేస్తోంది.