హైదరాబాద్: శుభ్‌మన్ గిల్‌తో పాటు కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ కూడా జట్టుకు భారంగా మారారు. ఇద్దరు ఫామ్‌లో లేకపోవడంతో జట్టు పలుమార్లు ఓటమిని చవిచూస్తోంది. తాజాగా సంజూ శామ్సన్‌ను కాదని గిల్‌కు అవకాశాలు ఇస్తున్నారు. గిల్ పేలవ ప్రదర్శనలు చేస్తున్నా కూడా అతడి జట్టులో స్థానంలో కల్పిస్తున్నారు. తన స్థానానికి న్యాయం చేయకపోవడంతో పాటు మరొకరి అవకాశాలపై దెబ్బపడుతున్నాయి. ఇప్పటికే గిల్‌పై క్రికెట్ అభిమానులు పీకల్లోతు కోపంగా ఉన్నారు. టి20 జట్టులో నుంచి గిల్‌ను తీసివేయాలని, మాజీ క్రికెటర్లు, క్రికెట్ పండితులు, అభిమానులు కోరుతున్నారు. బిసిసిఐ రాజకీయాలకు పాల్పడుతుందని క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, వైస్ కెప్టెన్ గిల్‌కు అభిషేక్ శర్మ మద్దతుగా నిలిచాడు. టి20 ప్రపంచ కప్‌లో సూర్య, గిల్ గెలిపిస్తారని జోస్యం చెప్పాడు. ఇద్దరు ప్రపంచ కప్‌లో అదరగొడుతారని ధీమా వ్యక్తం చేశారు. ప్రపంచ కప్ కంటే ముందు కీలక ఇన్నింగ్స్‌లు ఆడుతారని తెలియజేశారు. గిల్‌తో కలిసి చాలా కాలంగా ఆడుతున్నానని, ఎలాంటి పిచ్‌లపైన అయినా గిల్ బ్యాటింగ్ చేయగలుగుతాడని నమ్మకం ఉంచాడు. అందరికీ అతడిపై నమ్మకం కలుగుతుందని అభిషేక్ స్పష్టం చేశారు.
మూడో టి20ల్లో బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ప్రశంసించారు. ఫామ్‌లో లేనని, తనపై వస్తున్న విమర్శలకు స్పందించాడు. ఫామ్‌లో లేని విషయాన్ని అసలు తాను అంగీకరించానని, నెట్స్‌లో తాను అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నానని సూర్య వివరణ ఇచ్చాడు.