హైదరాబాద్: హయత్ నగర్ పిఎస్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టిసి కాలనీ సమీపంలో తండ్రి కూతుళ్లు రోడ్డు దాటుతుండగా కారు ఢీకొనడంతో వైద్య విద్యార్థిని అక్కడకక్కడే మృతి చెందింది. వైద్య విద్యార్థిని తండ్రికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. విద్యార్థిని మృతదేహం ఉస్మానియా ఆస్పత్రికి మార్చురీకి తరలించారు. స్థానికులు సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వైద్య విద్యార్థిని ఐశ్వర్యగా పోలీసులు గుర్తించారు.