వాట్ నెక్ట్స్ ఎంటర్టైన్మెంట్స్ తన తొలి ప్రొడక్షన్‌ను ‘ఇట్లు అర్జున’తో ప్రారంభించింది. సక్సెస్‌ఫుల్ దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించిన వెంకీ కుడుముల, కంటెంట్ బేస్డ్ కథలను ప్రోత్సహించాలనే లక్ష్యంతో నిర్మాతగా కొత్త జర్నీని ప్రారంభించారు. నూతన దర్శకుడు మహేశ్ ఉప్పల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనీశ్‌ను హీరోగా పరిచయం చేస్తున్నారు. అనస్వర రాజన్ హీరోయిన్. తాజాగా విడుదలైన ‘సోల్ ఆఫ్ అర్జున’ఈ మూవీ వరల్డ్‌ని అద్భుతంగా చూపించింది. ఈ గ్లింప్స్ కింగ్ నాగార్జున అందించిన మ్యాజికల్ వాయిస్ ఓవర్‌తో ప్రశాంతంగా, కవిత్వాత్మకంగా ప్రారంభమవుతుంది. డెబ్యూ హీరోగా అనీశ్ ఆకట్టుకునే నటన కనబరిచాడు. అనస్వర రాజన్ ఫ్రేమ్‌కు తాజాదనాన్ని తీసుకొస్తుంది. లీడ్ పెయిర్ మధ్య కెమిస్ట్రీ సహజంగా అనిపిస్తూ, గ్లింప్స్‌లోనే కథ భావోద్వేగాన్ని ప్రేక్షకుల హృదయానికి చేరువ చేస్తుంది. నాగార్జున మ్యాజికల్ వాయిస్ ఓవర్ ఈ గ్లింప్స్‌కు మెయిన్ హైలైట్‌గా నిలిచింది.