న్యూఢిల్లీ : బిజెపి జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నితిన్ నబీన్ సిన్హాను నియమించారు. ఆదివారం బిజెపి పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆయనకు ఈ కార్యనిర్వాహక బాధ్యతలు ఖరారు చేశారు. నితిన్ నబీన్ ఇప్పుడు బీహార్ రాష్ట్ర మంత్రిగా ఉన్నారు. 45 సంవత్సరాల నితిన్ పార్టీకి ఇప్పుడున్న జాతీయ అధ్యక్షులు జెపి నడ్డా స్థానంలో వెళ్లుతారని భావిస్తున్నారు. అయితే ఆయనకు పూర్తి స్థాయి అధ్యక్ష బాధ్యతలు కాకుండా వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించారు. ఆయన ఎంపిక గురించి సమావేశం తరువాత పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ప్రకటన వెలువరించారు. నబీన్ బీహార్ పిడబ్లడి మంత్రిగా ఉన్నా రు. పాట్నాలోని బంకీపూర్ స్థానం నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కాయస్థ కులానికి చెందిన నబీన్ వయస్సు 45 సంవత్సరాలు. ఈ విధంగా చూస్తే బిజెపికి అతి చిన్న వయస్కుడైన అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న నేతగా నిలిచారు. ఇప్పటి జాతీయ అధ్యక్షులు జెపి నడ్డా ఈ పదవికి 2020లో నియమితులు అయ్యారు. తమ పూర్తి కాలం ముగించుకున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల దశ లో పార్టీ సారధ్య బాధ్యతల నిర్వహణను కూడా బిజెపి నేతగా నిర్వర్తించారు.
నబీన్ నియామకం పట్ల ప్రధాని మో డీ హర్షం వ్యక్తం చేశారు. ఆయన కష్టపడి పనిచేసే కార్యకర్త అన్నారు. ఉత్సాహవంతుడు, అంకితభావంతో పనిచేసే నబీన్‌తో పార్టీ మరింత శక్తివంతం అవుతుందని ఆశాభా వం వ్యక్తం చేశారు. జాతీయ అధ్యక్షులు అయిన నబీన్ తండ్రి నబీన్ కిశోర్ ప్రసాద్ శర్మ , ప్రముఖ బిజెపి నేత. మాజీ ఎమ్మెల్యే, బంకీపూర్ స్థానానికి ప్రాతినిధ్యం వహించారు. సీనియర్ నబీన్ మృతితో ఈ స్థానంలో ఎమ్మెల్యేగా వచ్చిన నితిన్ తన పట్టు బిగిస్తూ సాగుతున్నారు. పాట్నా లో జన్మించిన నబీన్ ఇటీవలి బీహార్ ఎన్నికల్లోనూ తమ పాత స్థానం నుంచే సమీప ప్రత్యర్థిపై 51000కు పైగా ఓట్ల ఆధిక్యతతో గెలిచారు. వచ్చే ఏడాది పలు రాష్ట్రలలో అసెం బ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఈ దశలో పార్టీ కార్యనిర్వాహక కీలక బాధ్యతల్లోకి వచ్చిన నిబిన్‌పై రాష్ట్రాలలో బిజెపి బలోపేతం దిశలో కీలక చర్యలు తీసుకోవల్సిన బాధ్యత ఏర్పడింది.అయితే ఆనవాయితీకి భిన్నంగా ఆయనను కా ర్యనిర్వాహక అధ్యక్షుడిగా ప్రటించడం పట్ల రాజకీయ వర్గాలు పలు విధాలుగా వ్యాఖ్యానాలకు దిగాయి. బిజెపి పార్టీపరమైన వ్యవహారాలలో యువతరానికి విశేష ప్రాధాన్యత ఇవ్వాలని, కార్యకర్తల స్థాయిలో మరింత అనుసంధానంతో పార్టీ ప్రజల్లోకి దూసుకువెళ్లాల్సి ఉందనే ఆలోచనల క్రమంలోనే నితిన్ నియామకం జరిగినట్లు వెల్లడైంది.