కొడుకుపై తండ్రి విజయం సాధించిన ఘటన మెదక్ జిల్లా రామాయంపైట ఝాన్సీలింగాపూర్ పంచాయతీ ఎన్నికల్లో చోటుచేసుకుంది. సర్పంచి ఎన్నికల్లో తండ్రి, కొడుకులు పోటీపడ్డారు. తండ్రి మానెగల్ల రామకిష్టయ్య, కొడుకు వెంకటేశ్ నువ్వా నేనా అన్నట్లు ప్రచారం చేశారు. చివరకు ఓటర్లు రామకిష్టయ్యను గెలిపించారు. కొడుకు పై రామకిష్టయ్య 99 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు. గ్రామంలో మొత్తం 1985 ఓట్లు ఉండగా రామకిష్టయ్యకు 684 ఓట్లు రాగా కొడుకు వెంకటేశ్ కి 585 ఓట్లు పోలయ్యాయి. అయితే రామకిష్టయ్య మూడోసారిగా సర్పంచ్ గా గెలుపొందాడు.