మృతి చెందిన ఉద్యోగికి ఎలక్షన్ డ్యూటీ వేసిన సంఘటన నిర్మల్ జిల్లా, కడెం మండలం, పెద్దూర్ తండాలో చోటుచేసుకుంది. ఎన్నికల విధుల్లో పాల్గొనేందుకు వీలుగా పెద్దూరు తండాకు చెందిన హార్టికల్చర్ ఉద్యోగికి అధికారులు డ్యూటీ వేశారు. దీంతో పలువురు ఒక్కసారి షాక్‌కు గురయ్యారు. గ్రామానికి చెందిన సదరు ఉద్యోగి మరణించాడని, కానీ అతనికి ఎలక్షన్ డ్యూటీ వేయడమేంటని పలువురు ఆశ్చర్యానికి లోనయ్యారు. ప్రభుత్వం పకడ్బందీగా నిర్వహించే ఎన్నికల్లో ఇలాంటి సంఘటనలు పునరావృతం కావడం, అధికారుల నిర్లక్ష్యానికి నిలువెత్తు సాక్ష్యమని ఎస్‌సి, ఎస్‌టి ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర నాయకుడు రాజేష్ నాయక్ విమర్శించారు. ఇప్పటికైనా ఉద్యోగుల జాబితా పూర్తిగా తెలుసుకున్నాకే ఎన్నికల విధులకు కేటాయించాలని అన్నారు.