తాను అనారోగ్యంతో బాధపడుతున్నా కూడా ఓటు హక్కు ప్రాముఖ్యతను చాటిచెప్పేవిధంగా అంబులెన్స్‌లో పోలింగ్ కేంద్రానికి వచ్చిన ఒక వ్యక్తి ఓటు వేసి ఎందరికో ఆదర్శంగా నిలిచాడు. ఈ సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా, వలిగొండ మండల కేంద్రంలో ఆదివారం జరిగింది. రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేయడానికి వలిగొండ మండల కేంద్రానికి చెందిన బత్తిని సత్యనారాయణ గౌడ్ వచ్చాడు. అయితే, ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నా కూడా ఓటు హక్కు ప్రాముఖ్యతను చాటిచెప్పేలా అంబులెన్స్‌లో వచ్చి ఓటు వేశాడు. పలువురు వ్యక్తులు నేటి యువత అతనిని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని హితవు పలికారు.