గ్రామ పంచాయతీ ఓట్ల లెక్కింపులో ఇద్దరు అభ్యర్థులకు సమానంగా ఓట్లు వచ్చాయి.దీంతో పోలింగ్ అధికారులు డ్రా తీయగా కెతవత్ సునీత గెలుపొందారు. ఈ ఘటన మెదక్ జిల్లా , మండలంలోని చీపురుదుబ్బ తండాలో చోటుచేసుకుంది. చీపురుదుబ్బ తండా గ్రామపంచాయతీలో మొత్తం 377 ఓట్లు ఉండగా 367 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ అభ్యర్థి సునీతకు 182 ఓట్లు రాగా బిఆర్ఎస్ అభ్యర్థి బిమిలికి కూడా 182 ఓట్లు వచ్చాయి. మరో రెండు ఓట్లు చెల్లకుండా పోయాయి. ఒక ఓటు నోటా కి పడింది. దీంతో ఇద్దరికి సమానంగా ఓట్లు రావడంతో ఎన్నికల అధికారులు డ్రా తీయగా కాంగ్రెస్ అభ్యర్థి కెతావత్ సునిత విజయం సాధించింది.