ధర్మశాల: ఐదు టి-20ల సిరీస్‌లో భాగంగా ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో టి-20లో భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ సిరీస్‌లో ఇప్పటివరకూ భారత్, సౌతాఫ్రికా చెరో మ్యాచ్‌లో విజయం సాధించాయి. దీంతో ఈ మ్యాచ్‌లో నెగ్గి సిరీస్‌లో ఆధిక్యం సంపాదించుకోవాలని రెండు జట్లు భావిస్తున్నాయి. ఈ మ్యాచ్‌లో భారత్ జట్టులో రెండు మార్పులు చేసింది. అక్షర్, బుమ్రాలను జట్టు నుంచి తప్పించి వాళ్ల స్థానంలో హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్‌లను జట్టులోకి తీసుకుంది. సౌతాఫ్రికా జట్టులో మూడు మార్పులు చేసింది. మిల్లర్, లిండే, సిపామ్లాల స్థానంలో బోష్, అన్రిక్ నోర్ట్యే, స్టబ్స్ జట్టులోకి వచ్చారు.
తుది జట్లు
భారత్: అభిషేక్ శర్మ, శుభ్‌మాన్ గిల్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, హార్థిక్ పాండ్యా, శివమ్ దూబే, జితేశ్ శర్మ(కీపర్), హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి.
సౌతాఫ్రికా: రీజా హెండ్రిక్స్, క్వింటన్ డి కాక్(కీపర్), ఐడెన్ మార్క్రామ్(కెప్టెన్), డెవాల్డ్ బ్రీవిస్, ట్రిస్టన్ స్టబ్స్, డోనోవన్ ఫెరీరా, మార్కో జాన్సెన్, కార్బిన్ బాష్, అన్రిచ్ నోర్ట్యే, లుంగి ఎన్గిడి, ఒట్నీల్ బార్ట్‌మన్.