హైదరాబాద్: కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ సిఎం రేవంత్ రెడ్డి అధిష్టానం చూసుకుంటుందని టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. గ్లోబల్ సమ్మిట్ పై కాంగ్రెస్ అగ్రనేత రాహల్ గాంధీ కొన్ని వివరాలడిగారని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఫ్యూచర్ సిటీ హైదరబాద్ కు ఆకర్షణ కాబోతుందని ఆనందాన్ని వ్యక్తం చేశారు. బిఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు లేదని విమర్శించారు. భవిష్యత్తు ఉంటే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎందుకు బయటకు వస్తారని మహేష్ గౌడ్ ప్రశ్నించారు. తెలంగాణలో మాజీ సిఎం కెసిఆర్ కు ఉన్న చరిష్మా ప్రత్యేకమైనదని, పార్టీ నడపడం కెసిఆర్ తప్ప ఎవరితో సాధ్యం కాదని కొనియాడారు. తొలి దశ పంచాయితీ ఎన్నికల్లో కాంగ్రెస్ మెజార్టీ స్థానాల్లో గెలిచిందని, బిఆర్ఎస్ పెద్దగా సాధించింది ఏమీ లేదని అన్నారు. రెండోసారి తప్పనిసరిగా అధికారంలోకి వస్తామని తెలియజేశారు. తెలంగాణలో అనేక సంక్షేమాలు కార్యక్రమాలు అమలు చేస్తున్నామని, ప్రజలు పూర్తి స్థాయిలో సంతోషంగా ఉన్నారని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.