హైదరాబాద్: తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌లో ఫలితాల్లో అధికార కాంగ్రెస్ పార్టీనే ఆధిక్యంలో ఉంది. ఆదివారం జరిగిన పోలింగ్ అనంతరం ఓట్ల లెక్కింపు జరుగుతోంది. లెక్కింపులో కాంగ్రెస్ 305 స్థానాల్లో గెలుపొందింది. ఆ తర్వాత ప్రతిపక్ష బిఆర్ఎస్‌కు 36, బిజెపికి 9, ఇతరులకు 65 స్థానాలు దక్కాయి. ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతోంది. కాగా, ఈ విడతలో 193 మండలాలలో 4,333 సర్పంచి స్థానాలకు, 38,350 వార్డు స్థానాలకు ఎన్నికలు జరిగాయి. కాగా, సర్పం చ్ స్థానాలకు 12,782 మంది అ భ్యర్థులు పోటీ పడగా, వార్డు స్థానాలకు 71,071మంది అభ్యర్థు లు పోటీ పడ్డారు.