బాపట్ల: పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం మాచారంలో దారుణం చోటు చేసుకుంది. భార్యను గొంతునులిమి చంపి మృతదేహాన్ని భర్త బైక్ పై పిఎస్ కు తీసుకెళ్లాడు. నిందితుడు వెంకటేశ్వర్లు స్వగ్రామం సంతమాగూరు మండలానికి చెందినవాడు. పదేళ్ల కిందట వెంకటేశ్వర్లు, మహాలక్ష్మి ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరిద్దరికి ఇద్దరు సంతానం. భార్యాభర్తల మధ్య విభేదాలతో వెంకటేశ్వర్లకు దూరంగా మహాలక్ష్మి ఉంటుంది. శనివారం రాత్రి మాచవరంలో ఉంటున్న భార్య వద్దకు వెంకటేశ్వర్లు వెళ్లాడు. ఉదయం మహాలక్ష్మిని మాచవరం శివారుకు తీసుకెళ్లి హత్య చేశాడు. బాపట్ల జిల్లా సంతమాగులూరు పిఎస్ లో వెంకటేశ్వర్లు లొంగిపోయాడు. రొంపిచర్ల పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.