దుబాయ్: అండర్-19 ఆసియా కప్‌లో భాగంగా ఆదివారం యువ భారత జట్టు పాకిస్థాన్‌తో తలపడుతోంది. ఈ మ్యాచ్ టాస్ వర్షం కారణంగా ఆలస్యంగా జరిగింది. అనంతరం టాస్ గెలిచిన పాకిస్థాన్ తొలుత బౌలింగ్ చేసేందుకు ముందుకొచ్చింది. దీంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు నాలుగో ఓవర్‌లోనే షాక్ తగిలింది. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ(5) మహమ్మద్ సయ్యం బౌలింగ్‌లో అతడికే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. మరోవైపు కెప్టెన్ ఆయుష్ మాత్రే దూకుడుగా ఆడాడు. 25 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సులతో 38 పరుగులు చేసి సయ్యం బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. ఈ దశలో ఆరోన్ జార్జ్ జట్టుకు అండగా నిలిచాడు. మాత్రేతో కలిసి రెండో వికెట్‌కి 49 పరుగులు. విహాన్‌తో కలిసి మూడో వికెట్‌కి 27 పరుగులు జోడించాడు. ప్రస్తుతం భారత్ 17 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది. క్రీజ్‌లో ఆరోన్(46), వేదాంత్(2) ఉన్నారు.