తిమ్మాజిపేట: నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజిపేట మండలం అవంచలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. అవంచ గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. సర్పంచ్ అభ్యర్థులు సౌమ్య, చంద్రకళ వర్గీయుల మధ్య గొడవలు జరిగాయి. బిఆర్‌ఎస్, కాంగ్రెస్ వర్గాలకు చెందిన శ్రేణుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. బిఆర్‌ఎస్ నేతలు డబ్బులు పంచుతున్నారని కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకున్నాయి. ఈ ఘర్షణలో ఇద్దరు గాయపడడంతో జడ్చర్ల ఆస్పత్రికి తరలించారు.