లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత రవీంద్ర బెనర్జీ ముప్పానేని రూపొందిస్తోన్న చిత్రం ‘దండోరా’. ఈ మూవీలో శివాజీ, నవదీప్, నందు, రవికృష్ణ, మనికా చిక్కాల, మౌనికా రెడ్డి, బిందు మాధవి, రాధ్య, అదితి భావరాజు తదితరులు పాత్రధారులు. మురళీకాంత్ దర్శకత్వం వహిస్తున్నారు. డిసెంబర్ 25న మూవీ రిలీజ్ అవుతోంది. శనివారం ఈ సినిమా టైటిల్ సాంగ్ రిలీజ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో నటుడు శివాజీ మాట్లాడుతూ తెలంగాణ రూటెడ్ ఫిల్మ్ ఇదని అన్నారు. నిర్మాత రవీంద్ర బెనర్జీ ముప్పనేని మాట్లాడుతూ పాటలో ఉన్న ఎమోషన్ ఏదైతే ఉందో.. అదే సినిమాలోనూ కనిపిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు మురళీకాంత్, మైత్రీ శశిధర్, రవికృష్ణ, నందు, మణిక, మార్క్ కె రాబిన్, సృజన పాల్గొన్నారు.