అమరావతి: తరగతి గదిలో పాఠాలు వింటూ ఓ విద్యార్థిని కుప్పకూలిపోయి ప్రాణాలు విడిచింది. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం ప్రాంతంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలప్రకారం … పసలపూడి గ్రామానికి చెందిన నల్లమిల్లి వెంకట్‌రెడ్డి, సుజాత్ దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులకు సిరి(15) అనే కూతురు, కుమారుడు ఉన్నాడు. వివేకానంద పాఠశాలలో కుమారుడు ఎనిమిదో తరగతి చదువుతుండగా కూతురు పదో తరగతి చదువుతోంది. శనివారం ఉదయం తరగతి గదిలో టీచర్ పాఠాలు చెబుతుండగా అకస్మాత్తుగా బెంచీ పైనుంచి సిరి కిందపడిపోవడంతో వెంటనే ఆమెను స్థానిక ఆస్పత్రికి పాఠశాల సిబ్బంది తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే బాలిక చనిపోయిందని తెలిపారు. నెల రోజుల క్రితం స్పృహతప్పి పడిపోవడంతో తల్లిదండ్రులకు సమాచారం అందించారు. వారు ఆస్పత్రి ప్రథమ చికిత్స అందిస్తే కోలుకుందని తల్లిదండ్రులు తెలిపారు.