న్యూయార్క్: అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం రేపింది. రోడ్డు ఐలాండ్‌లోని బ్రౌన్ విశ్వవిద్యాలయంలో ఫైనల్ ఎగ్జామ్స్ జరుగుతుండగా దుండగుడు కాల్పులకు తెగపడ్డాడు. ఇంజనీరింగ్ భవనంలో జరిగిన కాల్పుల్లో ఇద్దరు దుర్మరణం చెందగా 8 మంది గాయపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దుండగుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఫోన్లను సైలంట్ ఉంచుకోవడంతో పాటు డోర్లను లాక్ చేసుకోవాలని విద్యార్థులకు మేయర్, అధికారులు హెచ్చరించారు. ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని దేవుని ప్రార్థించారు.