అందాల తార భాగ్యశ్రీ బోర్సే కమర్షియల్ చిత్రాలతో పాటు ప్రస్తుతం నటనకు ప్రాధాన్యత ఉన్న, విభిన్నమైన పాత్రలు కూడా చేస్తోంది. తాజాగా 1990ల నాటి ప్రొహిబిషన్ కాలం నేపథ్యం, సామాజిక అంశాల ఆధారంగా రూపొందనున్న ఒక మహిళా ప్రధాన చిత్రంలో ఆమె నటించనుంది. ఈ చిత్రంలో ఆమె సామాజిక సవాళ్లతో పోరాడే ఒక నిర్భయ యువతి పాత్ర పోషించనుందట. ఈ పాత్ర ఆమె నటనలోని మరొక కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసే అవకాశం ఉంది. ఈ ఆసక్తికరమైన కథాంశం కలిగిన చిత్రాన్ని స్వప్న సినిమాస్, దర్శకుడు వేణు ఊడుగుల సంయుక్తంగా నిర్మిస్తున్నారు.