మన తెలంగాణ/హైదరాబాద్: క్రికెట్ మేనియాగా ఉన్న హైదరాబాద్ ఒక్క సారిగా మెస్సీ రాకతో పుట్‌బాల్ మెనియాగా మారిపోయింది. మెస్సీ, సిఎం రేవంత్‌రెడ్డి టీం శ నివారం సాయంత్రం ఉప్పల్ రాజీవ్ గాంధీ స్టేడియంలో ఆడిన ఫుట్‌బాల్ మ్యాచ్ అభిమానులకు కనులవిందు చే సింది. ఆట ఏదైనా ఆదరిస్తాం అన్నట్లుగా హైదరాబాద్ క్రీ డాభిమానులు స్నేహపూర్వక మ్యాచ్‌కు సైతం భారీగా తరలివచ్చారు. కోట్లాది అభిమానుల ఆరాధ్య ఫుట్‌బాల్ దిగ్గ జం మెస్సీకి హైదరాబాద్‌లో ఘనస్వాగతం లభించింది. ఆయన రాక అభిమానులను ఉర్రూతలూగించింది. మెస్సీ మెస్సీ అనే స్లోగన్స్‌తో ఉప్పల్ మైదానం దద్దరిల్లింది. సిఎం తో కలిసి మెస్సీ ఐదు నిమిషాలు మ్యాచ్ ఆడినప్పటికీ మె స్సీ స్టేడియంలో 46 నిమిషాల పాటు గడిపి అభిమానుల ను అలరించారు. ఈ ఫ్రెండ్లీ మ్యాచ్‌లో సిఎం రేవంత్ రెడ్డి జట్టు సింగరేణి ఆర్‌ఆర్ విజయం సాధించిం కప్పు గెలుచుకుంది. సిఎం రేవంత్ రెడ్డి మ్యాచ్‌లో ఒక గోల్ కొట్టగా, మెస్సీ రెండు గోల్ కొట్టారు. అనంతరం జరిగిన పెనాల్టీ షూట్ అవుట్‌లో సింగరేణి ఆర్‌ఆర్ టీం మూడు గోల్స్ కొట్టగా, అందులో సిఎం రేవంత్‌రెడ్డి ఒక గోల్ కొట్టారు. అపర్ణ మెస్సీ టీం పెనాల్టీ షూట్ అవుట్‌లో ఒక గోల్ కొట్టిం ది.
దీంతో అపర్ణ టీం పై సింగరేణి ఆర్‌ఆర్ టీం విజయం సాధించింది. విజయం సాధించిన జట్టుకు మెస్సీ, సిఎం రేవంత్‌రెడ్డి, రాహుల్ గాంధీ సంయుక్తంగా అభినందించి, షీల్డ్‌ను అందచేశారు. సుమారు 46నిమిషాలు పాటు మె స్సీ మైదానంలో గడిపారు. మెస్సీతో పాటు ప్రముఖ ఫుట్‌బాల్ క్రీడాకారుడు లూయిస్ వారెజ్, రోడ్రిగో డిపాల్‌లు మైదానంలో అలరించారు. సింగరేణి ఆర్‌ఆర్, అపర్ణ మెస్సీ టిం మ్యాచ్‌లో ఆడేందుకు సిఎం రేవంత్ రెడ్డి 8 గంటల 6 నిమిషాలకు స్టేడియానికి చేరుకోగా, మెస్సీ తరువాత స్టేడియానికి వచ్చారు. మ్యాచ్‌లో సిఎం వేగంగా పరిగెడుతూ పుట్‌బాల్ ఆడడంతో స్టేడియం సిఎం సిఎం అంటూ మార్మోగింది. కాసేపు రేవంత్ రెడ్డి తాను సిఎం అన్న విషయాన్ని మరిచి ప్రొఫెషనల్ క్రీడాకారుడిని తలపించం విశేషం. మెస్సీ వస్తూనే అభిమానులకు అభివాదం చేయడంతో స్టేడియం అభిమానుల అరుపుల మధ్య దద్దరిల్లింది. స్టేడియంలోకి రాగానే మెస్సీ ఇరుజట్లతో కరచాలనం చేయడంతో, సిఎం జట్ల మధ్య నిలబడి మెస్సీ కరచాలనం అందుకుని క్రీడాకారులను ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా అభిమానులు ధరించిన మెస్సీ జెర్సీతో ఉప్పల్ స్టేడియం నీలిరంగుగా మారిపోయింది. గోట్ ఇండియా టూర్‌లో భాగంగా హైదరాబాద్‌లో నిర్వహించిన