లక్నో: ఉత్తరప్రదేశ్ బిజెపి రాష్ట్ర విభాగం అధ్యక్షులుగా కేంద్ర సహాయ మంత్రి పంకజ్ చౌదరి నియామకం దాదాపు ఖరారు అయింది ఈ పదవికి ఆయన ఒక్కరే తమ నామినేషన్ దాఖలు చేశారు. శనివారం ఆయన ఇక్కడ కేంద్ర మాజీ మంత్రి , బిజెపి ఎలక్షన్ ఆఫీసర్ మహేంద్ర నాథ్ పాండేకు అందించారు. ఈ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఆయన వెంట ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్, ఉప ముఖ్యమంత్రులు కేశవ్ ప్రసాద్ మౌర్య, బృజేష్ పాఠక్ ఇతర నేతలు కార్యకర్తలు ఉన్నారు. చౌదరి యుపిలోని మహారాజు గంజ్ పార్లమెంటరీ స్థానం నుంచి ఏడుసార్లు ఎంపిగా గెలిచారు. కుర్మీ కులానికి చెందిన వారు. ప్రధాని మోడీ, అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్‌లకు అత్యంత విధేయుడుగా ఉన్నారు.