న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం అత్యధిక స్థాయిలో పెరిగిపోతుండడంతో శ్వాసకోశ వ్యాధుల రోగులతో ఆస్పత్రులు కిక్కిరిసిపోతున్నాయి. రోజువారీ ఆస్పత్రులకు వచ్చే రోగుల సంఖ్య కన్నా 20 నుంచి 30 శాతం ఎక్కువగా శ్వాసకోశ వ్యాధుల రోగుల సంఖ్య ఉంటోందని డాక్టర్లు చెప్పారు. జలుబు, దగ్గు, ఊపిరాడకపోవడం, ఛాతీ బిగుసుకుపోవడం, తదితర లక్షణాలతో రోగులు వస్తున్నారని తెలిపారు. కాలుష్యం ఎక్కువగా ఉంటున్న ప్రాంతాల నుంచే రోగులు అధిక సంఖ్యలో వస్తున్నారని డాక్టర్లు తెలిపారు.