మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ’మన శంకర వర ప్రసాద్ గారు’. హిట్ మేకర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో కనిపించనున్నారు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్ లో నిర్మాతలు సాహు గారపాటి, సుష్మిత కొణిదెల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు, అర్చన సమర్పిస్తున్నారు. మన శంకర వర ప్రసాద్ గారు 2026 జనవరి 12న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. అయితే వెంకటేష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మేకర్స్ సినిమా నుంచి ఆయన ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్‌లో వెంకటేష్ స్టైలిష్‌గా కనిపించారు. ఇదే సందర్భంలో మెగాస్టార్ చిరంజీవి తన మిత్రుడు,
సహనటుడు వెంకటేష్‌కు సోషల్ మీడియా వేదికగా హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ చిత్రంలో చిరంజీవి సరసన నయనతార కథానాయికగా నటిస్తున్నారు. ఇక చిత్ర నిర్మాతలు సినిమా విడుదల తేదీని ప్రకటించడానికి ఒక గ్రాండ్ ఈవెంట్‌ని హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాతలు సాహు గారపాటి, సుష్మిత కొణిదెల పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనిల్ రావిపూడి మాట్లాడుతూ “మన శంకర వర ప్రసాద్ గారు సినిమా పూర్తి షూటింగ్ షెడ్యూల్‌ను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్- ప్రొడక్షన్ పనులను వేగంగా జరుపుకుంటోంది. ఈ చిత్రం సంక్రాంతికి కేవలం 2 రోజుల ముందు, జనవరి 12న థియేటర్లలో విడుదల కానుంది”అని అన్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి యంగ్ అండ్ డైమనిక్‌గా కనిపించిన రిలీజ్ డేట్ పోస్టర్ అదిరిపోయింది.