తిరుపతి: తిరుపతిలోని ఎస్వి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో కాంట్రాక్ట్ ఆంగ్ల అధ్యాపకురాలు.. విద్యార్థులకు అన్య మత బోధనలతో పాఠాలు చెప్పడం తీవ్ర దుమారం రేపింది. తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలన భవనం ఎదురుగా ఉన్న ఆ కళాశాలలో ఇలాంటి ఘటన జరగడం పట్ల హిందూ సంఘాలు కళాశాల ఎదుట ఆందోళనకు దిగాయి. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ ఆదేశాలతో సాంకేతిక విద్యాశాఖ ఆర్జెడి నిర్మల్ కుమార్ ప్రియ స్పందించారు. కాంట్రాక్ట్ అధ్యాపకురాలిని విధుల నుంచి తప్పిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.