పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘ఉస్తాద్ భగత్‌సింగ్’. ‘గబ్బర్ సింగ్’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత హరీశ్ శంకర్, పవన్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఈ సినిమాలో పవన్ ఓ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. చాలా రోజుల క్రితం ఈ సినిమా టీజర్‌ని వదిలింది చిత్ర యూనిట్. తాజాగా ఈ సినిమా నుంచి ‘దేఖ్‌లేంగే’ అంటూ సాగే తొలి పాటని విడుదల చేశారు.
ఈ పాటలో పవన్ చాలారోజుల తర్వాత డ్యాన్స్ ఇరగదీశారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతానికి ఆయన వేసిన స్టెప్పులు అదిరిపోయాయి. ఈ పాటని విశాల్ దద్లానీ, హరి ప్రియ పాడారు. భాస్కరభట్ల రవికుమార్ ఈ పాటకి సాహిత్యం అందించారు. దినేశ్ కుమార్ ఈ పాటని కొరియోగ్రాఫీ చేశారు. ఇక ఈ పాటలో హీరోయిన్ శ్రీలీల కూడా పవన్‌తో కలిసి చిందులేసింది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ పాటను ఓ లుక్కేసేయండి..