ఓ జంక్షన్ వద్ద ఆగిన రైలులోకి ఒకేసారి 30 నుంచి 40 మంది యువకులు బోగీలోకి దూసుకురావడంతో భయపడిన ఓ మహిళా ప్రయాణికురాలు రైలు లోని టాయిలెట్ లోకి వెళ్లి లాక్ చేసుకున్న ఘటన బిహార్ లో చోటుచేసుకుంది. వివరాలలోకి వెళిలే.. రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ మహిళ బిహార్ లోని జయనగర్ లో నివసిస్తుంది. ఆమె ఇటీవల జానకి ఎక్స్ ప్రెస్ రైలులో ప్రయాణించింది. ఆ సమయంలో రైలు బిహార్ లోని కతిహార్ జంక్షన్ వద్ద ఆగగా 30 నుంచి 40 మంది దాకా యువకులు రైలు ఎక్కారు. దీంతో భయాభ్రాంతులకు గురైన మహిళా గట్టిగా అరుస్తూ రైలులోని టాయిలెట్ లోకి వెళ్లి లాక్ చేసుకొని రైల్వే అధికారులకు సమాచారం ఇచ్చింది. దీంతో వెంటనే అప్రమత్తమైన రైల్వే భద్రతా సిబ్బంది, పోలీసులు టికెట్ లేకుండా బోగీలోకి ఎక్కిన ప్రయాణికులను దింపేసారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియాను మహిళా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది.