హైదరాబాద్: మరికొన్ని రోజుల్లో సంక్రాంతి పండుగ వస్తుంది. ఈ పండగకి అందరూ తమ సొంతుళ్లకు వెళ్లి కుటుంబసభ్యులతో సంబరాలు జరుపుకోవాలని భావిస్తుతుంటారు. అలాంటి వారి కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను డిసెంబర్ 14 నుంచి ఉదయం 8 గంటల నుంచి అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేస్తున్నట్లు పేర్కొంది. ఈ సదుపాయాన్ని ఉయోగంచుకోవాలని విజ్ఞప్తి చేసింది. 2026 జనవరి నుంచి ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. సికింద్రాబాద్ నుంచి విజయవాడ మీదుగా.. ఏపీలోని ఇతర ప్రాంతాలకు, అలాగే ఇతర రాష్ట్రాలకు ఈ రైళ్లు నడపనున్నారు. ఈ ప్రత్యేక రైళ్లలో 1AC, 2AC, 3AC, స్లీపర్, జనరల్, సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి.