హైదరాబాద్: అవగహన లేని పిచ్చోళ్లు పోస్టులు పెట్టారని బిజెపి ఎంపి ఈటల రాజేందర్ తెలిపారు. ఈ పోస్టులపై పార్టీ తేలుస్తుంది.. టైమ్ విల్ డిసైడ్ అన్నారు. బిజెపి ఎంపి ఆటల రాజేందర్ హాట్ కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బండి సంజయ్ పిఆర్వో పోస్టులపై ఈటల అసహనం వ్యక్తం చేశారు. అవగాహన ఉన్నోడు అలా పోస్టులు పెడతారా? అని ప్రశ్నించారు. సందర్భం వచ్చినప్పుడు అన్నీ చెప్తానని, పంచాయితీ ఎన్నికలయ్యాక హైకమాండ్ కు వివరిస్తానని ఈటల రాజేందర్ పేర్కొన్నారు.