హైదరాబాద్: బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శఖత్వంలో తెరకెక్కిన లేటె్స్ట్ మూవీ ‘అఖండ-2: తాండవం’. నిజానికి ఈ సినిమా గత వారమే విడుదల కావాల్సింది. కానీ, ఆర్థిక సమస్యలు తలెత్తడంతో వాయిదా పడింది. అన్ని సమస్యలు క్లియర్ కావడంతో ఈ సినిమాను నిన్న (నవంబర్ 12న) విడుదల చేశారు. ప్రీమియర్స్ నుంచే ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. థియేటర్లలో సినిమా చేూసిన అభిమానులు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమా తొలి రోజు కలెక్షన్లను చిత్ర నిర్మాణ అధికారికంగా ప్రకటించింది. పీమియర్స్‌తో కలిపి తొలి రోజు ఈ సినిమా రూ.59.5 కోట్లు వసూలు చేసిట్లు తెలిపింది. బాలకృష్ణ కెరీర్‌లోనే మొదటి రోజు ఈ స్థాయిలో వచ్చిన తొలి చిత్రం ఇదే కావడం విశేషం.