కథలాపూర్: జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలంలో విషాదం చోటుచేసుకుంది. తమ్ముడు ఎన్నికల్లో ఓడిపోతున్నాడని తెలిసి అక్క గుండెపోటుతో మృతి చెందింది. గంభీర్ పూర్ గ్రామంలో సర్పంచ్‌గా పోతు శేఖర్ పోటీ చేశారు. కౌంటింగ్ జరుగుతుండగా తమ్ముడు వెనుకంజలో ఉన్నాడని తెలిసి అక్క మమత ఆవేదన చెందింది. అక్కడే కూలబడిపోవడంతో వెంటనే ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. గుండెపోటుతో మమత మృతి చెందిందని పరీక్షించిన వైద్యులు తెలిపారు. గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. మృతురాలి కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.