గాంధీనగర్: ఏడేళ్ల బాలికను పొలంలో నుంచి లాక్కెళ్లి ఆమెపై ఓ వ్యక్తి అత్యాచారం చేశాడు. అనంతరం ప్రైవేటు పార్ట్‌లో ఇనుప రాడ్ జొప్పించాడు. ఈ సంఘటన గుజరాత్ రాష్ట్రం రాజ్‌కోట్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… అట్‌కోట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ గ్రామంలో రామ్‌సింగ్ అనే వ్యక్తి నివసిస్తున్నాడు. పక్కన పొలంలో ఓ దంపతులు కూలీ పని చేయడానికి వచ్చారు. ఈ దంపతులకు ఏడేళ్ల కూతురు ఉండడంతో పొలం దగ్గర కూర్చొబెట్టారు. రామ్‌సింగ్ బాలికను పొదల్లొకి లాక్కెళ్లి ఆమెపై అత్యాచారం చేశాడు. అనంతరం ప్రైవేటు పార్ట్‌లలో ఇనుప చువ్వను జొప్పించాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. పాప కనిపించడంలేదని తల్లిదండ్రులు వెతికారు. పాప రక్తపు మడుగులో కనిపించడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. పాప ఆరోగ్య పరిస్థితి సాధారణంగా ఉందని పరీక్షించిన వైద్యులు తెలిపారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.