అమరావతి: విజయనగరం జిల్లా తెర్లాం మండలం చిన గొలుసులో అగ్నిప్రమాదం జరిగింది. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడడంతో 10 పూరిళ్లు దగ్ధం అయ్యాయి. వృద్ధురాలు సజీవదహనం అయింది. స్థానికులు సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.