నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న సినిమా గుర్రం పాపిరెడ్డి. ఈ చిత్రాన్ని డా. సంధ్య గోలీ సమర్పణలో ప్రొడ్యూసర్స్ వేణు సద్ది, అమర్ బురా, జయకాంత్ (బాబీ) నిర్మిస్తున్నారు. డార్క్ కామెడీ కథతో ఇప్పటి వరకు మనం తెరపై చూడని కాన్సెప్ట్‌తో దర్శకుడు మురళీ మనోహర్ రూపొందిస్తున్నారు. ‘గుర్రం పాపిరెడ్డి‘ సినిమా ఈ నెల 19న వరల్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ సందర్భంగా నిర్మాతలు జయకాంత్(బాబీ), అమర్ బురా మీడియాతో ముచ్చటించారు. జయకాంత్ (బాబీ) మాట్లాడుతూ “గుర్రం పాపిరెడ్డి టైటిల్ క్యారెక్టర్‌లో నరేష్ ఆగస్త్య బాగా నటించాడు. – ఫరియా అబ్దుల్లాకు మంచి కామెడీ టైమింగ్ ఉంది. ఆమె జాతిరత్నాలు సినిమాలో చేసిన చిట్టి క్యారెక్టర్ ట్రెడిషనల్ గా ఉంటుంది. ఆ పాత్రతో చూస్తే మా ‘గుర్రం పాపిరెడ్డి‘ మూవీలో ఆమె చేసిన సౌధామిని క్యారెక్టర్ పూర్తిగా డిఫరెంట్ గా ఉంటుంది. బ్రహ్మానందం, యోగి బాబు కీలకమైన పాత్రలు చేశారు”అని అన్నారు. అమర్ బురా మాట్లాడుతూ “తెలివిలేని వాళ్లు తెలివైన వాడిని ఎలా ఎదుర్కొన్నారు అనేది మా మూవీ పాయింట్. ఫన్, కామెడీతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. సందేశాలు వినేందుకు ప్రేక్షకులు థియేటర్స్ కు రారు. వాళ్లను ఆ కాసేపు ఎంటర్ టైన్ చేయాలి. మా మూవీ కంటెంట్ మీద పూర్తి నమ్మకంతో ఉన్నాం. మ్యాడ్, మ్యాడ్ 2 చూస్తున్నప్పుడు ఆ పాత్రలను చూస్తేనే ఎలా నవ్వుకున్నామో మా సినిమాలోనూ ఆర్టిస్టులను చూడగానే ఫన్ గా ఫీలవుతారు”అని పేర్కొన్నారు.