ఓ వ్యక్తి నడవలేని స్థితిలో ఉండి కూడా అంబులెన్స్‌లో వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా సాలూర మండలం జాడి జామాల్‌పూర్ పోలింగ్ కేంద్రంలో జరిగింది. గ్రామానికి చెందిన ఆరోగ్య రాజు నెల రోజుల క్రితం ప్రమాదానికి గురయ్యారు. నడవలేని స్థితిలో ఉన్న ఆయనను కుటుంబ సభ్యులు ఇంటి నుంచి పోలింగ్ కేంద్రానికి అంబులెన్స్‌లో తీసుకెళ్లగా, పోలింగ్ అధికారులు అంబులెన్స్ వద్దకే వచ్చి ఆయనతో వాహనంలోనే ఓటు వేయించి పంపించారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎంత రసవత్తరంగా సాగుతున్నాయని చెప్పడానికి ఇదో నిదర్శనం.