మన తెలంగాణ/వికారాబాద్ జిల్లా బ్యూరో: సర్పంచ్‌గా పోటీచేసి ఓడిపోయిన ఓ మహిళా ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలం ఖాజాహైమద్‌పల్లిలో చోటుచేసుకుంది. ఖాజాహైమద్‌పల్లి గ్రామ సర్పంచ్‌గా కాంగ్రెస్ పార్టీ నుంచి ఇద్దరు మహిళలు పోటీపడ్డారు. వారిలో లక్ష్మి అనే మహిళ సర్పంచ్ అభ్యర్థిగా పోటీచేసి సమీప ప్రత్యర్థి చేతిలో గురువారం వెలువడిన ఫలితాల్లో ఓడిపోయింది.
ఈ ఓటమిని తట్టుకోలేక తీవ్ర మనస్థాపం చెందిన లక్ష్మి పురుగుల మందు తాగిన ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, స్థానికి హుటాహుటినా కొడంగల్ ఆసుపత్రికి తరలించారు. ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనతో గ్రామంలో టెన్షన్ వాతావరణం నెలకొంది.