జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం తిమ్మయ్యపల్లె గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తల్లి, కుమార్తె మధ్య పోటీ నెలకొంది. రిజర్వేషన్‌లో బీసీ మహిళకు కేటాయించడంతో శివరాత్రి గంగవ్వను బీఆర్‌ఎస్ బలపరచగా ఆమె కుమార్తె సుమలతను కాంగ్రెస్ బలపరిచింది. పోలింగ్ అనంతరం ఓట్ల లెక్కింపులో తల్లి గంగవ్వపై కుమార్తె సుమలత 91 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. తల్లి గంగవ్వపై 91 ఓట్ల తేడాతో కుమార్తె పల్లెపు సుమ గెలిచినట్లు అధికారులు ప్రకటించారు.